నాతో శోభనం రాత్రి.. ఆమె ఎందుకు అసౌకర్యానికి గురైందంటే..

by Aamani |   ( Updated:2023-05-14 11:26:44.0  )
నాతో శోభనం రాత్రి.. ఆమె ఎందుకు అసౌకర్యానికి గురైందంటే..
X

దిశ, సినిమా : ఓ సినిమా కోసం తమ మధ్య రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు భాగ్యశ్రీ ఎందుకు అసౌకర్యానికి గురైందో నటుడు సమీర్ సోనీ వెల్లడించాడు. ‘భాగ్య శ్రీతో నా మొదటి షూట్ అనుభవం. మేమిద్దరం ప్రేమికులుగా నటించిన చిత్రంలో ఆమె అంధ బాలికగా కనిపించింది. అయితే శోభనం రాత్రి సన్నివేశం కోసం కిటికి దగ్గర, వెన్నెల కింద చాలా చక్కని ఫ్రేమ్‌ని సెట్ చేశారు దర్శకుడు. అయితే నేను ఆమె దగ్గరికి వెళ్లిన ప్రతిసారి దూరం జరుగుతోంది. ఇలా చాలా సార్లు జరిగింది. సమస్య ఏమిటని నేను ఆశ్చర్యపోయాను. కాసేపటి తర్వాత భాగ్యశ్రీ నన్ను పక్కకు తీసుకెళ్ళి.. ‘నాకు చిన్న పిల్లలున్నారు. నన్ను ఇలా చూస్తే అసౌకర్యానికి గురవుతారు. సినీ కెరీర్ కంటే నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం’ అని చెప్పింది. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ డైరెక్టర్‌కు వివరించాను’ అని చెప్పుకొచ్చాడు సమీర్.

Also Read:: సంక్రాంతి బరిలోకి దిగనున్న రవితేజ, మహేష్ బాబు!

Advertisement

Next Story