Sameera Reddy : పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అవమానం తట్టుకోలేక హీరోయిన్ పేరెంట్స్ ఏం చేశారంటే

by samatah |   ( Updated:2023-08-13 08:01:16.0  )
Sameera Reddy : పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అవమానం తట్టుకోలేక హీరోయిన్ పేరెంట్స్ ఏం చేశారంటే
X

దిశ, సినిమా : సీనియర్ నటి సమీరా రెడ్డి తన పెళ్లికి సంబంధించి వచ్చిన రూమర్స్‌పై ఎట్టకేలకు స్పందించింది. ఈ మేరకు తనకు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని, అందుకే ప్రియుడితో రహస్యంగా మూడుముళ్లు వేయించుకుందంటూ ఇండస్ట్రీలో అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న విమర్శలను గుర్తుచేసుకుంటూ.. ‘నా స్నేహితుడు, ప్రియుడు అక్షయ్‌తోనే 2014లో పెళ్లి జరిగింది. అందరూ ఊహించనట్లు కాకుండా మా ఇంటి టెర్రస్‌పై సింపుల్‌గా చేసుకున్నాం. దీంతో పెళ్లికి ముందే గర్భం దాల్చానని, అందుకే హడావుడిగా చేసుకున్నానని పుకార్లు వినిపించాయి. ఆ కామెంట్స్ విని బాధపడ్డప్పటికీ అందులో నిజం లేదు కాబట్టి మాట్లాడి ప్రయోజనం లేదని ఊరుకున్న. మా ఇద్దరి ఫ్యామిలీల అంగీకారంతోనే మా వివాహం జరిగింది’ అని చెప్పింది. అలాగే ప్రెగ్నెంట్ టైమ్‌లో బాడీ షేమింగ్‌కు గురైనట్లు తెలిపిన నటి.. రొడ్దు మీద కూరగాయలు అమ్ముకునే వాళ్లు కూడా కామెంట్స్ చేశారని, దీంతో కొంతకాలం బయటకు వెళ్లేందుకు బయపడ్డానంటూ వాపోయింది.

Read More: సమంత-విజయ్ దేవరకొండ ‘ఖుషి’.. ఆ సినిమాకు కాపీ అంటూ దారుణమైన ట్రోల్స్

Advertisement

Next Story