కేన్స్‌‌లో సమంత ‘శాకుంతలం’ సినిమాకు నాలుగు అవార్డులు.. పెద్ద జోక్ అంటున్న నెటిజన్స్

by sudharani |   ( Updated:29 May 2023 4:59 AM  )
కేన్స్‌‌లో సమంత ‘శాకుంతలం’ సినిమాకు నాలుగు అవార్డులు.. పెద్ద జోక్ అంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దెవ్ మెహాన్ కాంబినేషన్‌లో భారీ బడ్జేట్‌తో వచ్చిన చిత్రం ‘శాకుంతలం’. దీనికి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో అంచనాలను అందుకోలేక పోవడంతో బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో సామ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అభిమానుల అంచనాలను అనుకోకపోయినా ఈ సినిమా వరుస అవార్డులను మాత్రం అందుకుంటోంది.

గతంలో న్యూయార్క్‌లో రెండు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ‘శాకుంతలం’ సినిమాకు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. ఫ్రాన్స్‌లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, ఫాంటసీ ఫిల్మ్,కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ సినిమా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఈ విషయాన్ని గుణ టీమ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అది చూసిన నెటిజన్లు కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా.. మరికొంత మంది ఎవరు ఇచ్చారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Read more:

నాగచైతన్య ప్లేస్‌ను ఆ యంగ్ హీరోతో రీప్లేస్ చేస్తున్న సమంత

అక్కినేని అఖిల్ నెక్ట్స్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సమంత..!

Advertisement

Next Story