మయోసైటిస్ వ్యాధిపై సమంత సంచలన నిర్ణయం..!

by Hamsa |   ( Updated:2022-11-27 08:54:50.0  )
మయోసైటిస్ వ్యాధిపై సమంత సంచలన నిర్ణయం..!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హాస్పిటల్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసింది. అయితే సామ్ ఈ వ్యాధిని వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. అమెరికాలో ఒకసారి చికిత్స తీసుకుని ఇండియాలో కూడా అదే ట్రీట్ మెంట్ కంటిన్యూ చేస్తుందట. అయినా వ్యాధి తగ్గకపోవడంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాజాగా, సమంత కేరళలో ఆయుర్వేద వైద్యంతో తగ్గుతుందని తెలిసి కేరళ వెళ్లినట్టు సమాచారం. కాగా, సమంత కేరళలో ఆల్రెడీ ఆయుర్వేద వైద్యాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే కోలుకుంటుందని అక్కడి వైద్యులు చెప్పినట్టు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ విధంగా అయినా సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుటుందా? లేదో అన్నది చూడాలి.



Also More......

టాలీవుడ్ కాదు బాలీవుడ్ నన్ను కాపాడింది

Advertisement

Next Story