విడాకులపై స్టార్ హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-03-29 12:32:55.0  )
విడాకులపై స్టార్ హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధంలో ఎంత నిజాయితీగా ఉన్నా వర్కౌట్ కాలేదని శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వివాహ జీవితంలో తాను ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ.. తనపై అనవసరంగా నిందలు వేశారని సమంత పేర్కొంది. విడాకులు తీసుకున్నా కొంత కాలానికే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని.. ఖాళీగా ఉండలేక దానికి ఒకే చెప్పానని తెలిపింది.

అయితే, ఈ టైమ్‌లో ఐటెం సాంగ్స్ కరెక్ట్ కాదని ఇంట్లో వాళ్లు వారించిన.. తాను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంట్లో బాధపడుతూ కూర్చోవాలనే ఆ సాంగ్ చేశానని చెప్పుకొచ్చింది సామ్. వ్యక్తిగత జీవితంపై కూడా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను పడిన ప్రతిసారి బలంగా నిలబడ్డానని.. నన్ను వేలేత్తి చూపిస్తే గెలిచినట్టు కాదని ఇంట్రెస్టింగ్స్ కామెంట్స్ చేసింది. నా తప్పు లేనప్పటికీ తనను చాలా మంది జడ్జ్ చేశారని.. అయినప్పటికీ తాను ఎప్పుడు నిజాయితీగానే ఉంటూ ఎవరికి భయపడలేదని తెలిపింది సామ్. ఈ రెండేళ్ల జీవితం తనకు ఎంతో నేర్పిందని.. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా మరింత బలంగా ఉన్నానంది.

Read more:

రెండేళ్లుగా నేను అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాను: సమంత

Advertisement

Next Story

Most Viewed