- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Deputy CM:గిరిజన ప్రాంతాల్లో రోడ్లు.. నేడు శంకుస్థాపన చేయనున్న పవన్ కళ్యాణ్
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్ర అభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం(AP Government) దూసుకెళ్తుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) నేడు(శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం విశాఖకు నిన్న(గురువారం) రాత్రి చేరుకున్నారు.
విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్‌కు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కోన తాతారావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ప్రశాంతి, భీమిలి ఇంఛార్జి శ్రీ పంచకర్ల సందీప్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాడిసన్ హోటల్‌కు వెళ్లి బస చేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు డోలి మోతల కష్టం ఉండకుండా ప్రభుత్వం రోడ్లు నిర్మించనుంది. మన్యం, అల్లూరి జిల్లాల్లో మారుమూల గిరిజన గ్రామాల నుంచి ప్రధాన రహదారుల్ని కలిపేలా రోడ్లు వేయనుంది. 9 గిరిజన ప్రాంతాల్లో 48 కి.మీ మేర రోడ్ల నిర్మాణం కోసం తాజాగా రూ.49.73కోట్లు మంజూరు చేసింది. 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు.. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డోలీల బాధల ఉండదు. నేడు ఈ రెండు జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.