వైసీపీకి బిగ్ షాక్.. విశాఖ డెయిరీ చైర్మన్ ఆనంద్ రాజీనామా

by srinivas |   ( Updated:2024-12-20 08:48:26.0  )
వైసీపీకి బిగ్ షాక్.. విశాఖ డెయిరీ చైర్మన్  ఆనంద్ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆనంద్(Visakha Dairy Chairman Adari Anand) రాజీనామా చేశారు. ఆనంద్‌తో పాటు 12 మంది డెయిరీ డైరెక్టర్లు కూడా వైసీపీ(Ycp)కి గుడ్ బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వాలకు సైతం రాజీనామాలు చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీని వీడుతున్నామని తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖలను జగన్‌కు పంపారు.

కాగా విశాఖ డెయిరీలో ఎంప్లాయిస్ యూనియన్, కాంట్రాక్టు లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలని కార్మికలు డిమాండ్ చేస్తున్నారు. అటు రైతులు సైతం ఆందోళనలు చేపట్టారు. పాల ధరల విషయంలో యాజమాన్యం నిర్ణయం సరిగా లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాలసేకరణను నిలుపుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో డెయిరీ చైర్మన్ ఆనంద్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed