- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: మా అన్నను అరెస్టు చేస్తారా..? ఆరా తీస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ లాబీలో ఫార్ములా ఈ-రేసు కేసు హాట్ టాపిక్‌గా మారింది. సభలో రాష్ట్ర అప్పులపై సీరియస్‌గా డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఫార్ములా రేసు కేసులో కేటీఆర్‌ను ఏసీబీ ఏ1గా పేర్కొన్న విషయం బయటికి వచ్చింది. ఈ విషయం తెలిసిన గులాబీ ఎమ్మెల్యేలు షాక్‌కు గురయ్యారు. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకున్నారు. అటుగా కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కనిపిస్తే.. తమ వద్దకు పిలిచి ‘మా అన్నను అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎప్పుడు చేస్తారు? అని ఆరా తీశారు. కొందరు ఎమ్మెల్యేలైతే ఏసీబీ విచారణ ఎదుర్కోవడానికి తమ లీడర్ ఎప్పుడో మానసికంగా రెడీ అయ్యారని, నిధుల చెల్లింపుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చెప్పారు. ఈ కేసులో కేటీఆర్‌ను నిందితుడిగా చేర్చుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఏ1గా చేర్చిన విషయం తెలియగానే గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు సైతం కంగుతిన్నట్లు తెలుస్తున్నది.
ఓ వైపు ఏసీబీ కేసు.. మరోవైపు సిట్ విచారణ
ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌ను ఏసీబీ ఏ1 నిందితుడిగా చేర్చడాన్ని జీర్ణించుకునేలోపే మరో చేదు వార్తను సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా వినిపించారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. పోలీసుల ఎంక్వయిరీ ఎదుర్కోక తప్పుదు. దీనితో అటు ఏసీబీ కేసు, ఇటు సిట్ విచారణతో తమ యువనేత కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పవనే చర్చ గులాబీ ఎమ్మెల్యేల్లో జరిగినట్టు తెలుస్తున్నది.