లుక్ మార్చేసిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్.. నువ్వు రైతు బిడ్డవి కాదు రాయల్ బిడ్డవి అంటూ ట్రోల్స్

by Kavitha |
లుక్ మార్చేసిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్.. నువ్వు రైతు బిడ్డవి కాదు రాయల్ బిడ్డవి అంటూ ట్రోల్స్
X

దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ సీజన్-7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామన్ మ్యాన్‌గా హౌస్‌లో అడుగుపెట్టి.. తన గేమ్, ఎమోషనల్ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. దీంతో ఓటింగ్‌లో దూసుకుపోయి.. విన్నర్ అయ్యాడు. అయితే విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ స్టేజ్ మీద నాగార్జునతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలకి.. తాను గెలిచిన మొత్తం మనీని పేదలకు పంచి వేస్తాను అంటూ భారీ డైలాగులు కొట్టాడు. కానీ గెలిచి ఏడాది అవుతున్నా కూడా బాబు సాయం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ మొదలయ్యాయి.

తాజాగా పల్లవి ప్రశాంత్ లుక్ చేంజ్ అయింది. రాయల్‌గా కనిపిస్తూ ఫొటోలకు స్టిల్ ఇచ్చాడు. వాటిని తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేయండంతో ఈ పిక్స్ కాస్త వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు.. రైతు బిడ్డ గెలిచిన రూ.35లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. మొత్తం రైతులకి దానం చేస్తానని బీరాలు పలికాడు కానీ సహాయం చేయలేదు అని, రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ తెగ రచ్చ చేస్తున్నారు. మరి మీరు పల్లవి ప్రశాంత్ లుక్‌‌ను ఓ సారి చూసేయండి.

Advertisement

Next Story