- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు శాపంగా గురుకుల పాఠశాల.. కిటికీలు లేక చలికి గజగజ
దిశ, యాచారం: గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సకల వసతులతో పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. దీంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శంషాబాద్ గురుకుల పాఠశాలలో 500 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. 14 వరకు టాయిలెట్లు ఉండగా.. అందులో కొన్నింటికి డోర్లు లేక, మరి కొన్నింటికి డోర్లు సరిగా పనిచేయక ఉన్న వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు. స్కూల్ టైం వరకు సిద్ధం కావడానికి ప్రతిరోజూ సాహసమే చేయాల్సి వస్తోంది. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో టాయిలెట్ల పక్కనే పేరుకుపోయిన మురుగునీటి కుంటతో, వాటి నుంచి వచ్చే దుర్వాసన, అందులో పెరిగే దోమలు, ఈగలతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. తరగతి గదులకు డోర్లు, పడకగదుల్లో వేలాడుతున్న లైట్లు నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నాయి. శిథిలమవుతున్న అద్దె భవనంలో గురుకుల పాఠశాల కొనసాగడం విద్యార్థులకు శాపంగా మారింది. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
చలికి వణుకుతున్న భావితరం..
విద్యార్థులు పడుకుంటున్న గదులకు కిటికీలు లేకపోవడంతో చలికి గజగజ వణుకుతున్నారు. కిటికీలకు బొంతలను మాత్రమే ఏర్పాటు చేసి వదిలి వేయడంతో నరకం అనుభవిస్తున్నారు. ప్రతిరోజూ చలికి వణుకుతూ కాలం వెల్లదీయాల్సి వస్తున్నది.
అధికారుల దృష్టికి సమస్యలు పరిష్కారమయ్యేనా?
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా, ఈ నెల 14న గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పక్కా భవన నిర్మాణం డిగ్రీ కళాశాలతో పాటు గురుకుల పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.