- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bachala Malli: ‘బచ్చల మల్లి’ సినిమా రివ్యూ.. అల్లరి నరేష్ హిట్ కొట్టాడా..? లేదా..?
దిశ, సినిమా: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన సినిమా ‘బచ్చల మల్లి’. డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో.. హాస్యా మూవీ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది..? అల్లరి నరేష్ హిట్ కొట్టాడా..? లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం..
కథ విషయానికొస్తే.. బచ్చల మల్లి(అల్లరి నరేష్)కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. మల్లి టెన్త్ అయిపోయి కాలేజీ చదివే సమయంలో వాళ్ళ నాన్న(జై రామ్) వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం బయటపడటంతో అనుకోని పరిస్థితుల్లో అతని భార్యని(రోహిణి), మల్లిని వదిలేసి రెండో భార్య కోసం వెళ్ళిపోతాడు. దీంతో మల్లి తన నాన్న మీద పగ పెంచుకొని మూర్ఖంగా పెరుగుతాడు. తినడం, తాగడం, తిరగడం, కుదిరితే పని చేయడం ఇంతే మల్లి పని. ఎవరైనా నాన్న విషయం ఎత్తితే ఆ మూర్ఖత్వం ఇంకా పెరిగిపోతుంది. ఇలాంటి మల్లి జీవితంలోకి కావేరి(అమృత అయ్యర్) రావడంతో అన్ని మానేసి మంచిగా మారిపోయి గోనెసంచుల వ్యాపారం నడిపిస్తాడు. అలాగే కావేరిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. మంచిగా మారిపోయిన మల్లి మళ్ళీ ఎందుకు మూర్ఖంగా మారాడు? తాగి పడిపోయి ఉన్న మల్లిని పొడిచి చంపడానికి ప్రయత్నించింది ఎవరు? మల్లి కావేరి ప్రేమకథ ఏమైంది? తండ్రి తప్పుని క్షమించాడా? మల్లి మామూలు మనిషిగా మారాడా లేదా అనేది సినిమా మొత్తం స్టోరీ.
సినిమా విశ్లేషణ: ఈ మూవీకి డైరెక్టర్ సుబ్బు మంగాదేవి సెలెక్ట్ చేసుకున్న స్టోరీ కోర్ పాయింట్ బాగున్నప్పటికీ… ఆయన తీసిన తీరు బాలేదని, రొటీన్ స్క్రీన్ ప్లేతో తీయడం వల్ల సోల్ మిస్ అయ్యిందని కొంత మంది నెటిజన్లు పేర్కొంటున్నారు.. నరేష్ యాక్టింగ్ మరోసారి అదిరిపోయింది. రూరల్ డ్రామాల్లో మనం చూసే సన్నివేశాలు చాలా ‘బచ్చల మల్లి’ సినిమాలో ఉన్నాయని నెటిజన్స్ చెబుతున్నారు. అక్కడక్కడ కొన్ని ప్రామిసింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ సరిగా తీయలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. దీంతో సినిమా ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదని తేల్చేశారు.