Mahesh Kumar Goud: కేటీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారు: పీసీసీ చీఫ్

by Prasad Jukanti |
Mahesh Kumar Goud: కేటీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారు: పీసీసీ చీఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం కోల్పోయినా ఇంకా కేటీఆర్ అదే అహంకారంతో మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్, ఎమ్మల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) విమర్శించారు. ఫార్ములా -ఈ కార్ రేస్ (Formula-E Car Race) అంశంలో కేటీఆర్ (KTR) పై కేసు సక్రమమైన చర్యనే అన్నారు. శుక్రవారం కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి రంగంలోనూ అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటికి పంపించారని అయినా కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పోవట్లేదని అన్ని నిబంధనల మేరకే జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిన వారికి శిక్ష పడాల్సిందేనని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అందులో భాగంగానే తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. గడిచిన పదేళ్లు జరిగిన దోపిడిని రాబట్టాల్సిన అవసరం ఉందని తప్పుచేసిన వారు శిక్ష నుంచి తప్పుకోలేరన్నారు.



Next Story

Most Viewed