- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడితో కలిసి రొమాంటిక్ సాంగ్‌కి చిందులేసిన విరూపాక్ష బ్యూటీ.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
దిశ, సినిమా: ‘విరూపాక్ష’(Virupaksha) సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనియా సింగ్(Sonia singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ షార్ట్ ఫిల్మ్‌లతో మంచి ఫేమ్ తెచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘న్యూ ఏజ్ గర్ల్‌ఫ్రెండ్’(New Age Girlfriend), ‘నాన్ తెలుగు గర్ల్‌ఫ్రెండ్’(Non Telugu Girlfriend) వంటి షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఈ భామకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్(Samyuktha menon) జంటగా నటించిన ‘విరూపాక్ష’ మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలో ఈ భామదే మెయిన్ రోల్ అన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై వచ్చిన ‘యమలీల’(Yamaleela) సీరియల్‌లో కూడా నటించి మెప్పించింది. అంతేకాక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ తన కో యాక్టర్ అయిన సిద్ధూ పవన్(Sidhu Pawan)తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వారు పలు షోల్లో పాల్గొన్నప్పుడు వెల్లడించారు. ప్రస్తుతం ఈ జంట ఢీ షోలో టీమ్ లీడర్స్‌గా మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సోనియా సింగ్, సిద్ధూ పవన్ కలిసి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR), సమీరా రెడ్డి(Sameera Reddy) జంటగా నటించిన ‘నరసింహుడు’(Narasimhudu) సినిమాలోని ‘ఏలుకో నాయకా’ అనే సాంగ్‌కు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ క్యూట్ కపుల్, మాటల్లేవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.