Samanth : మరో సావిత్రిలా సమంత.. తన జీవితంలో ఒడిదొడుకులకు తనే కారణమా?

by Jakkula Samataha |   ( Updated:2024-04-28 09:14:45.0  )
Samanth : మరో సావిత్రిలా సమంత.. తన జీవితంలో ఒడిదొడుకులకు తనే కారణమా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన సినీ లైఫ్ స్టార్టింగ్‌లో ఎంత సంతోషంగా,హై రేంజ్‌కు ఎందిగిపోయిందో.. ఇప్పుడు అంతలా తన కెరీర్ డౌన్ ఫాల్ అవుతుంది. అయితే దీనికి కారణం తన పర్సనల్ నిర్ణయాలే అంటున్నారు కొందరు.

సావిత్రిలా అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏ పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోతుంది. 2010లో ఏ మాయ చేసావే సినిమాతో.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ .ఆ సినిమాలో సమంత నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. జెస్సీగా యూత్‌ను తెగ ఆకట్టుకుంది. దీంతో సమంత లైఫ్ ఊహించని మలుపు తిరిగింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకొని, తన నటనతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతే కాకుండా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఆమె గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ దక్కించుకుంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా సమంత ఒక సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగించింది.

ఇక ఒకానొక సమయంలో టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్,సమంతను ఈ జనరేషన్‌లో మరో సావిత్రిగా పోల్చారు. అంతే తన నటనతో సమంత అంతటి పేరును సంపాదించుకుంది. అంతటి రేంజ్ సంపాదించుకున్న సామ్, కెరీర్ డౌన్ ఫాల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. జీవితం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది అంటారుగా, సమంత జీవితంలోనూ అలానే జరుగుతుందేమో.. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ పెళ్లితో, ఈ జంటపై చాలా మంది మంచి ఒపీనియన్ పెంచుకున్నారు. బ్యూటిఫుల్ పేయిర్‌గా నిలిచారు. వీరు కలిసి ఏ సినిమా చేసినా.. అది మంచి సక్సెస్ అయ్యేది. ఇక వీరు ఆనందంగా ఉంటారు అనుకునే సమయానికి.. విడాకులతో ఇద్దరూ వేరు అయిపోయారు. దీంతో సమంత మానసికంగా కుంగిపోయి తన కెరీర్‌పై ఫోకస్ చేయడం ఆపేసింది. అంతే కాకుండా మయోసైటీస్ బారిన పడటంతో సామ్ వచ్చిన ఆఫర్స్ వదిలేసి, చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే చేసి సినిమాలకు సంవత్సరకాలం బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇలా సమంత కెరీర్ డౌన్ ఫాల్ అయిపోయింది. ఇప్పటికీ కూడా సామ్ ఒక్క పెద్ద ప్రాజెక్ట్‌కు కూడా కమిట్ అవ్వలేదనే చెప్పవచ్చు. ఇలా ఎవరూ ఊహించని విధంగా సమంత కెరీర్ మలుపు తిరిగింది. కానీ ఈ బ్యూటీ జీవితంలో స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది మాత్రం ప్రత్యూష ట్రస్ట్..తన తన కెరీర్ ప్రారంభంలో అనాధ పిల్లలకు సాయం చేయడం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తన జీవితంలోని ప్రతీ స్పెషల్ సందర్భాన్ని ఆ పిల్లలతోనే జరుపుకుంటుంది. దీంతో అంతబాగానే ఉన్నా.. తన నిర్ణయాల వలన మరో సావిత్రిలా సమంత లైఫ్ టర్న్ అయిపోతుందేమో అంటున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story

Most Viewed