సమంత యశోద సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్

by srinivas |   ( Updated:2023-12-15 14:28:17.0  )
సమంత యశోద సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్
X

దిశ,వెబ్‌డెస్క్: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం యశోద. ఈ సినిమాకు హరి–హరీష్‌ ద్వయం దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. యశోద సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. తాజాగా యశోద తెలుగు ట్రైలర్‌ను రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. 'మీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా, ఒక బిడ్డను మోస్తున్న తల్లికి మాత్రమే ఆ విధమైన చప్పుడు వినిపిస్తుంది' అనే డైలగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతోంది. యశోద సినిమాలో సమంత డైలాగ్స్, ఫైట్స్ అదరగొట్టింది. కాగా, ఈ సినిమాను నవంబర్ 11న దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


Advertisement

Next Story

Most Viewed