సమంత 'యశోద' మూవీ.. టీజర్ అప్‌డేట్

by sudharani |   ( Updated:2022-10-18 13:10:35.0  )
సమంత యశోద మూవీ.. టీజర్ అప్‌డేట్
X

దిశ, సినిమా : సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'యశోద'. హరి-హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల విడుదలైన యశోద ఫస్ట్ లుక్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో సాలిడ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ఫస్ట్ టీజర్‌ను ఈ నెల 9న సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ సమంతతో పిక్‌తో కూడిన ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

మెగాస్టార్ గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌‌కు పవర్ స్టార్

Advertisement

Next Story