ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. హెల్త్ కండీషన్‌పై రియాక్ట్ అయిన సామ్

by Satheesh |   ( Updated:2023-03-25 09:29:49.0  )
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. హెల్త్ కండీషన్‌పై రియాక్ట్ అయిన సామ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఆరోగ్యం గురించి అభిమానులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మయోసైటిస్ వ్యాధి నుండి ప్రస్తుతం కోలుకుంటున్నానని.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపింది. ప్రస్తుతం బయటకు రాగలుగుతున్నానని.. తిరగగలుగుతున్నానని చెప్పింది. ఇక, గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోన్న సమంత.. సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాస్త ఆరోగ్యం మెరుగుపడటంతో సామ్ తిరిగి మళ్లీ షూటింగ్‌ల్లో పాల్గొంటుంది. ప్రస్తుతం సామ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయదేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘‘ఖుషి’’ సినిమాలో నటిస్తోంది.

Advertisement

Next Story