మీడియాకు షాకిచ్చిన Samantha.. ఆ ప్రశ్నలు వేయద్దు అంటూ కండీషన్?

by samatah |   ( Updated:2022-10-17 11:06:39.0  )
మీడియాకు షాకిచ్చిన Samantha.. ఆ ప్రశ్నలు వేయద్దు అంటూ కండీషన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఈ అమ్మడు విపరీతంగా ట్రోల్స్ గురి అవుతూ వస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, గత కొన్ని రోజుల నుంచి నెట్టింట్లో కనిపించక పోవడంతో తమ అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు, సమంత స్కిన్ ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లిందని, కొందరు అంటే మరికొందరు సామ్ అజ్ఞాతంలో ఉంది అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సామ్ నటించిన యశోధ, శాకుంతలం మూవీస్‌ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.

దీంతో సామ్ అజ్ఞాతం వీడనుందని, తనను ఎన్నో ప్రశ్నలు సంధించడానికి అటు మీడియా, ఇటు తమ అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే ఇన్ని రోజులు సమంత అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం ఏమిటి, నాగచైతన్యతో బ్రేకప్స్ గురించి వారు ప్రశించనున్నారంట. కాగా, వీటన్నింటికి సమాధానాలు చెప్పడానికి సమంత రెడీగా లేనట్లు తెలుస్తోంది. పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని, వ్యక్తిగత ప్రశ్నల కంటే కెరియర్ , సినిమాలకు సంబంధించిన ప్రశ్నల పైనే ఫోకస్ పెట్టాలని, మీడియాకి కూడా కండిషన్ పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి సామ్ మీడియా ముదుకు వచ్చాక, ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో, వాటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి అంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చ‌ద‌వండి

1.నటిపై కన్నేసిన క్యాబ్‌ డ్రైవర్.. సిగ్నల్ దాటగానే అలా చేస్తూ

Advertisement

Next Story