Samantha to Anushka.. కుర్ర హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే!

by Anjali |   ( Updated:2023-09-11 16:21:50.0  )
Samantha to Anushka.. కుర్ర హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఏజ్‌తో సంబంధం లేకుండా కుర్రహీరోలతో నటించి.. రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రేమకు ఏజ్‌తో సంబంధం ఏముంది రా చారి’ అంటూ అదుర్స్ చిత్రంలో కమెడియన్ బ్రహ్మానందం ఒక డైలాగ్ చెపుతాడు. అదే తరహాలో రియల్ లైఫ్‌లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నప్పటికీ సినిమాల్లో కూడా తమకంటే చిన్న వయసు హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీరే అంటూ తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో సీనియర్ హీరోయిన్ అనుష్క యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి నటించింది.

అలాగే సమంత-విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘అల్లుడు శ్రీను’ సినిమాలో సమంత, మిస్టర్ మజ్నులో అక్కినేని అఖిల్‌తో నిధి అగర్వాల్‌, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో అఖిల్‌తో పూజా హెగ్డే, ‘దేవదాస్’ చిత్రంలో ఇలియానాతో రామ్ పోతినేని, ‘గణేష్’ చిత్రంలో కాజల్‌తో కూడా జతకట్టాడు. అలాగే ఎన్టీఆర్, మహేష్ బాబు తమకంటే ఎక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్స్‌తో కలిసి నటించారు. ఈ హీరో రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా తనకంటే నాలుగేళ్లు పెద్దదైన నమ్రతను వివాహం చేసుకున్నాడు. సింహాద్రి చిత్రంలో ఎన్టీఆర్ తనకంటే ‘నాలుగేళ్ల’ పెద్దదైన భూమికతో రొమాన్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి : Vishal అంటే నాకు చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన హీరోయిన్

Advertisement

Next Story