Samantha:పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత.. అన్నింటికి మించింది ప్రేమంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Hamsa |
Samantha:పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత.. అన్నింటికి మించింది ప్రేమంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి మయోసైటీస్ వ్యాధితో బాధపడుతుంది. దీంతో సినిమాలకు దూరం అయి ఏడాది దాటింది. ప్రజెంట్ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలు తెలుపుతోంది.

అయితే సామ్‌తో చై విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో ప్రేమలో పడి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక సమంత మాత్రం మయోసైటీస్‌తో పోరాడుతోంది. తాజాగా, ఈ స్టార్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేసింది. ఆమె సోదరుడు డేవిడ్ ప్రభు వివాహం అమెరికాలో సెప్టెంబర్ 21న ఘనంగా జరగ్గా ఈ ఫొటోలను సామ్ షేర్ చేసింది. డేవిడ్, నికోల్‌తో క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి జరిగింది. ఈ వేడుకల్లో కుటుంబంతో కలిసి సామ్ చాలా కాలం తర్వాత అద్భుతమైన క్షణాలు గడిపినట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ ‘‘అన్నింటికంటే మించింది ప్రేమ’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ సామ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story