నేనింకా వాటి మల మూత్రాలను ఎత్తిపోస్తున్న.. సామ్ ఎమోషనల్

by Prasanna |   ( Updated:2023-04-09 05:29:35.0  )
నేనింకా వాటి మల మూత్రాలను ఎత్తిపోస్తున్న.. సామ్ ఎమోషనల్
X

దిశ, సినిమా : స్టార్ నటి సమంత తాను ఎప్పుడూ పాన్ ఇండియా స్టార్‌గా ఫీల్ అవలేదంటోంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సామ్ రీసెంట్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘నేను పాన్‌ ఇండియా స్టార్‌నని నా పెంపుడు జంతువులకు ఎవరన్నా చెబితే బాగుండు. ఎందుకంటే నేనింకా వాటి మల మూత్రాలను ఎత్తిపోస్తున్నా. అయినా పాన్ ఇండియా మూవీల్లో నటించడం వల్ల నా జీవితంలో ఎలాంటి మార్పులేదు. ఆరు గంటల వరకే నేను స్టార్‌ని. ఆ తర్వాత నా జీవితం సాదాసీదాగా సాగుతుంది’ అని చెప్పింది. అలాగే డిస్నీ జానర్ సినిమాలంటే చాలా ఇష్టమని, ఎప్పుడు బాధగా ఉన్నా అవే చూస్తానన్న నటి.. ‘‘శాకుంతలం’లో యువరాణిగా నటించడం కొత్తగా అనిపించింది. మొదట ఈ కథ విని భయపడ్డప్పటికీ సవాల్‌ విసిరే పాత్ర చేయాలని ఒప్పుకున్నా. ఇలాంటి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్‌. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఇందులో ప్రేమ, మోసం ఉంది. అంతకు మించిన భావోద్వేగాలు ఉన్నాయి. శకుంతల పాత్రకు న్యాయం చేశాను’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

ఇవి కూడా చదవండి: సమంత, చై మళ్లీ కలిసిపోతున్నారా..? లవ్ సింబల్ షేర్ చేసిన సామ్

Advertisement

Next Story