స‌మంత‌ను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అలా అడ‌గ్గానే.. ఓ లుక్కేసి, అవునంది!

by Sumithra |   ( Updated:2023-08-18 15:52:21.0  )
స‌మంత‌ను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అలా అడ‌గ్గానే.. ఓ లుక్కేసి, అవునంది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌మంతా రూత్ ప్ర‌భు గురించి తెలియ‌నివారుండ‌రు. 'ఫ్యామిలీ మ్యాన్' సినిమాతో బాలివుడ్ మ‌న‌సును దోచుకున్న స‌మంతా హిందీలో మ‌రో కొత్త ప్రాజెక్ట్ చేయ‌బోతుంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే, దీని కోస‌మో ఏమో గానీ స‌మంతా ఇటీవ‌ల ముంబై ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్క‌డ ఆమెను చూసిన అభిమానులు, సెల్ఫీలంటూ క్యూ క‌ట్టారు. ఇంత‌లో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మంతా కించిత్ కోపంగా చూసి స‌మాధానం చెప్పింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో స‌మంత‌ను ఫోటో తీస్తున్న ఓ వ్య‌క్తి "మేడం, మీకు హిందీ వ‌చ్చా" అని అడుగుతాడు. వెంట‌నే, స‌మంతా ఆశ్చ‌ర్యంగా, కాస్త ఇబ్బందిప‌డిన‌ట్లు చూస్తుంది. ఒక సెక‌ను త‌ర్వాత తేరుకోని, "థోడా.. తోడా..." అంటూ స్మైలీ లుక్‌తో స‌మాధానం చెబుతుంది. ఈ వీడియోను 'వైర‌ల్‌భ‌యానీ' అనే ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసిన వ్య‌క్తి, 'ఎంత క్యూట్‌గా స‌మాధానం చెప్పిందంటూ' ప్ర‌శంసించాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. స‌మంత‌కు హిందీ ఎంత వ‌చ్చో అనే విష‌యం ప‌క్క‌న‌పెడితే, ఆమె చెప్పిన విధానానికి అంద‌రూ ఫిదా అవుతున్నారు.

Advertisement

Next Story