మేనేజర్ మోసం.. తాడోపేడో తేల్చుకునేందుకు హైదరాబాదుకు చేరుకున్న Samantha

by Anjali |   ( Updated:2023-09-05 07:53:04.0  )
మేనేజర్ మోసం.. తాడోపేడో తేల్చుకునేందుకు హైదరాబాదుకు చేరుకున్న Samantha
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ - సమంత ప్రధాన పాత్రలో నటించిన ఖుషి చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోది. చాలా కాలం తర్వాత ఇద్దరికీ హిట్ పడటంతో విజయ్, సమంత ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ అమ్మడు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. అనంతరం మయోసైటిక్ వ్యాధి నయం కోసం అమెరికా వెళ్లిందని కొందరు, ఇండిపెండెన్స్ పరేడ్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లిందని కొంతమంది సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. ఈమె నిజానికీ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లలేదు. ‘ఖుషి’ సినిమా ప్రమోట్ చేయడం కోసం అమెరికా బాట పట్టిందంటున్నారు మరికొందరు.

అక్కడ సామ్‌తో చిన్నపాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిపించారు. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, విజయ్ దేవరకొండ తెలుగు బిగ్ బాస్ షోకు గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత ఎక్కడా? అని హోస్ట్ నాగార్జున అడగ్గా.. మరో మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తుందని విజయ్ దేవరకొండా చెప్పాడు. అయితే ఆమె ఇంత త్వరగా హైదరాబాద్ రావడానికి బలమైన కారణమే ఉందంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఆమె మేనేజర్ కోటి రూపాయల విషయంలో మోసం చేసినట్లు టాక్ వచ్చింది. దానికోసమే మేనేజర్‌తో మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకుందామనే వచ్చిందంటూ సమాచారం.

Advertisement

Next Story