Samantha : నాగచైతన్య-శోభిత ఎంగేజ్మెంట్... సమంత నెక్ట్స్ మూవ్ మామూలుగా లేదుగా.. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా దెబ్బకొట్టే ప్లాన్..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-08 11:28:14.0  )
Samantha : నాగచైతన్య-శోభిత ఎంగేజ్మెంట్... సమంత నెక్ట్స్ మూవ్ మామూలుగా లేదుగా.. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా దెబ్బకొట్టే ప్లాన్..
X

దిశ, సినిమా: నాగ చైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అక్కినేని ఫ్యామిలీ, అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. న్యూ కపుల్ చూడచక్కగా ఉన్నారని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరోపక్క సమంత.. చైతూకి ప్రపోజ్ చేసిన రోజునే ఎంచుకోవడంపై సామ్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ఇలాంటి సంఘటన జరుగుతుందని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదని ఫీల్ అయిపోతున్నారు. ఏదేమైనా చై.. సమంతతోనే బాగుంటాడని... అలాగని తాము శోభితను హేట్ చేయట్లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మరో ట్విస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అని ప్రచారం జరుగుతుంది. సమంత.. నాగ చైతన్యపై ప్రొఫెషనల్ లేదా పర్సనల్ గా చట్టపరమైన యాక్షన్ తీసుకోబోతుందనే విషయం బయటకు వచ్చింది. త్వరలోనే తన టీం ఇందుకు సంబంధించిన ప్రకటన రిలీజ్ చేయనుందని తెలుస్తుంది. అయితే ఇది నిజంగానే నిజమా? లేక గాసిప్ మాత్రమేనా? అనేది సమయమే చెప్తుంది.

(Story Credits Cinecorn Telugu Instagram Channel)

Advertisement

Next Story