Samantha: నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్.. సమంత షాకింగ్ పోస్ట్..

by Kavitha |
Samantha: నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్.. సమంత షాకింగ్ పోస్ట్..
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీతో బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌‌లు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళతో లవ్‌లో ఉన్నారనే ఓ పుకారు నెట్టింట షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా చైతూ, శోభితా ఇద్దరు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త బాంబులా పేలింది. దాంతో ఈ వార్త నిజమేనా అనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అయితే రెండు సైడ్‌ల నుంచి ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఈ విషయం మరింత అనుమానాస్పదంగా మారింది.

ఇదిలా ఉండగా, చైతూ, శోభితా ఎంగేజ్‌మెంట్ వార్త బయటకు రావడానికి కొన్ని గంటల ముందు సమంత ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో భాగంగా .. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్లు.. ఎప్పడూ కూడా ఒంటరి వాళ్లు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్లను పై నుంచి ఓ శక్తి కాపాడుతుంటుంది. ఎల్లప్పుడు ఆ శక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుంది. అలాంటి సమయంలో నీ మానసిక స్థైర్యం చాలా గొప్పది. నీకు ఎప్పుడూ మేమంతా అండగా ఉంటాం అంటూ వినేష్ పోగట్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. అయితే వినేశ్‌తోపాటు తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పరోక్షంగా పోస్టు చేసిందని.. నాగచైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నారనే బాధతోనే ఇలా ఆ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

(video link credits to samantha instagram id)

Advertisement

Next Story