ఆ విషయం గురించి Vijayకి చెప్పేస్తానంటూ... Samantha ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-09-04 06:13:25.0  )
ఆ విషయం గురించి Vijayకి చెప్పేస్తానంటూ... Samantha ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలై మొదటి షోతోనే హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఖుషి రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

తాజాగా, దీనిపై అమెరికాలో ఉన్న సమంత ఓ కార్యక్రమంలో తన ఆనందం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఖుషి సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా అమెరికాలో ఉన్న అభిమానులు, సినీ ప్రేమికుల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది దీనిని నేను నమ్మలేకపోతున్నా. అమెరికాలోనే నా కెరీర్‌ ప్రారంభమైంది. నా కెరీర్‌ ఎదుగుదలతో భాగమైన ఇక్కడి వారిని కలవడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది. ఇప్పటివరకూ నేను నటించిన 16 చిత్రాలు 1 మిలియన్‌ డాలర్లు వసూళ్లు సాధించాయి. ఖుషితో ఆ సంఖ్య 17కు చేరింది. అందుకు ఎంతో గర్విస్తున్నా.

మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమకు థ్యాంక్స్‌ అనే మాట చాలా చిన్నది. గత నెల రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నాను. ఖుషి సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమ గురించి విజయ్‌తో చెబుతా. మీ అందరికీ ఆయనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇంటికి దూరంగా కొన్ని వేల మైళ్ళు ప్రయాణించి ఇక్కడికి వచ్చినప్పటికీ.. ఇక్కడ ఉంటే నా ఇంట్లోనే ఉన్న భావన కలుగుతుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: Balakrishnaను చూస్తే అలాగే అనిపిస్తారు.. Sreeleela ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story