‘కంగ్రాట్స్ పతిత’ నాగ చైతన్య-శోభితపై సంచలన కామెంట్స్ చేసిన సమంత లవర్.. దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2024-08-09 17:23:58.0  )
‘కంగ్రాట్స్ పతిత’ నాగ చైతన్య-శోభితపై సంచలన కామెంట్స్ చేసిన సమంత లవర్.. దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరో నాగచైతన్య. ఈ హీరో మొదటగా జోష్ చిత్రంలో నటించాడు. కానీ ప్రేక్షకులు ఆశించిన రేంజ్‌లో హిట్ కాలేకపోయింది. తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేశావే’ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక అప్పటి నుంచి నాగచైతన్య యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తోటి నటి సమంతతో ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే లవ్ లో పడ్డాడని టాక్. ఏకంగా ఇందులో పదిహేను సార్లు ముద్దులు పెట్టుకున్నారు నాగచైతన్య-సమంత.

కొన్నాళ్లపాటు లవ్ లో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ వీరి పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. అనూహ్యంగా సామ్-చై విడిపోయి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అదే రేంజ్‌లో ఇప్పుడు చైతూ.. శోభితాతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని అక్కినేని అభిమానులకు అంతకుమించి భారీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థం పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి ఫొటోలే కనిపిస్తున్నాయి.

ఇకపోతే అప్పట్లో సమంత ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉందని నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. పైగా అతడి కారణంగానే సామ్.. చైతన్యకు విడాకులు ఇచ్చిందని టాక్ వచ్చింది. మరీ ఆ పర్సన్ ఎవరో కాదు.. సామ్ కు బాగా క్లోజ్ అయిన ప్రీతం జుకాల్కర్. ప్రస్తుతం నాగ చైతన్య-శోభితా నిశ్చితార్థం పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ప్రీతం వీరికి ఊహించని విధంగా ఇన్‌డైరెక్ట్‌గా విష్ చేశాడు. ‘కాంగ్రాట్ పతిత. సీక్రెట్స్, అబద్ధాలు ఎంత జాగ్రత్తగా దాచాలని చూసినా సంబధాన్ని చంపేస్తారంటూ ప్రీతం జుకాల్కర్.. చై-శోభితాను ఉద్దేశించే ఇలా విషెష్ చెప్పినట్లు నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ఈ కామెంట్ వీక్షించిన అక్కినేని ఫ్యామిలీ సామ్ బాయ్ ఫ్రెండ్ కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. మరికొంతమంది సామ్-చై విడిపోవడానికి శోభితనే కారణమని చెబుతున్నాడా? ఏంటి అంటున్నారు. ప్రీతమ్-సామ్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి.. వీరి జీవితంలో ఏం జరిగిందో అంతా ప్రీతమ్ కే తెలుసునని, శోభితా కారణంగానే సామ్ ను మోసం చేశాడని, అందుకే ఈ విధంగా కామెంట్లు చేశాడని చర్చించుకుంటున్నారు.

Read more...

అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే.. రాబోతున్న మరో గుడ్ న్యూస్..!

Advertisement

Next Story