Samantha: రెమ్యూనరేషన్ పెంచేసిన సమంత.. పెద్ద మొత్తం అందుకుంటున్న మొదటి హీరోయిన్‌గా రికార్డు!

by sudharani |
Samantha: రెమ్యూనరేషన్ పెంచేసిన సమంత.. పెద్ద మొత్తం అందుకుంటున్న మొదటి హీరోయిన్‌గా రికార్డు!
X

దిశ, సినిమా: ‘ఏమాయా చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సమంత.. అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా పలువురు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ.. విడాకుల అనంతరం పూర్తి ఫోకస్ సినిమాలపై పెట్టింది. మళ్లీ ఫామ్‌లోకి వస్తుంది అనుకునే క్రమంలోనే మయోసైటిస్‌ అనే వ్యాధికి గురవ్వడంతో సినిమాల జోరు తగ్గించింది. పూర్తి దృష్టి ఆరోగ్యంపైనే పెట్టింది. ఇప్పుడు మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్ బ్యూటీ.. సినిమాలు, వెబ్‌సీరిస్‌లతో బిజీగా ఉండేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత పారితోషికం‌పై ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సమంత ప్రజెంట్ ‘సిటాడెల్‌-హనీ బన్నీ’ అనే వెబ్‌సీరిస్‌తో బిజీగా ఉంది. ఇది త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ వెబ్‌సీరిస్‌లో నటించినందుకు ఈ బ్యూటీ ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇది సౌత్‌ హీరోయిన్స్‌ పారితోషికంలో సరికొత్త రికార్డుగా చెబుతున్నారు ఇండస్రీ విశ్లేషకులు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్‌ కూడా ఇంత పెద్ద మొత్తం అందుకోలేదట. అందులోనూ.. సినిమా కాకుండా ఓ వెబ్‌సీరిస్‌కు అందుకోవడం కూడా విశేషమనే చెబుతున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. గతంలో కూడా తెలుగు సినిమాల్లో రెమ్యూనరేషన్స్‌ విషయంలో సమంత ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రజెంట్ ఈ రెమ్యూనరేషన్ టాపిక్ హాట్ న్యూస్‌గా మారింది.

Advertisement

Next Story