‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌పై క్లారిటీ ఇచ్చిన సమంత

by Hamsa |   ( Updated:2023-04-13 07:20:20.0  )
‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌పై క్లారిటీ ఇచ్చిన సమంత
X

దిశ, సినిమా: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ఇందులో సమంత నటించిన ‘ఊ అంటావా మావా’ పాట దేశవ్యాప్తంగా మస్తు పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఈ ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప2’ ను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని, దానికి కూడా సమంతనే చేయబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై ఓ తాజా ఇంటర్వ్యూలో సామ్ స్పందించింది. ప్రజెంట్ ‘శాకుంతలం’ మూవీ ప్రమోషన్స్‌‌లో బిజీగా ఉన్న ఆమె వరుస ఇంటర్వ్యూలో తన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ‘పుష్ప 2’ మూవీలో సాంగ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది. ‘‘మీరు అనుకుంటున్నట్లుగా నేను ఎలాంటి ఐటమ్ సాంగ్ చెయ్యడం లేదు’’ అంటూ సింపుల్‌గా సమాధానం ఇచ్చింది సామ్.

ఇవి కూడా చదవండి: సుకుమార్ టీమ్ నుంచి బిగ్ అప్‌డేట్.. ‘పుష్ప3’ కూడా రాబోతుందా?

Advertisement

Next Story