విజయ్ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన సమంత.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-08-14 07:15:55.0  )
విజయ్ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన సమంత.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం సమంత కొన్నాళ్లు మూవీస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్న అంటూ చెప్పిన విషయం తెలిసిందే. హెల్త్ పరంగా తాను కొన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ‘ఖుషి’ సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇటీవల ‘ఖుషి’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించగా.. ఈ వేడుకకు సమంత రాలేదు. దీంతో సమంతపై కొందరు అభిమానులు నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన సమంత తన దైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చింది.

ఈ మేరకు ‘‘మీరు మీ కోసం బతకండి. ఈ లోకం కోసం, సమాజం కోసం బ్రతకాల్సిన పనిలేదు. మీ గౌరవం ఏమిటో తెలుసుకోండి. మీ స్థాయిని పెంచుకోండి. మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అది అంత అవసరం లేదు. పది మందిలో ఒకరిలా కాకుండా యూనిక్‌గా జీవించండి. ఈ సమాజంలో ఏం చేసినా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు. మన జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు’’ అంటూ ఓ నోట్ షేర్ చేసింది సమంత. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ మాటలు పరోక్షంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ని ఉద్దేశించే సమంత అన్నారని నెట్టింట పెద్ద రచ్చ నడుస్తుంది.

Read More: ఎట్టకేలకు కొత్త ప్రాజెక్ట్‌.. ఓకే చెప్తూ సంతకం చేసిన సంయుక్త, షూటింగ్ ఎప్పుడంటే..

Advertisement

Next Story

Most Viewed