Samantha : ముంబైలో ఇల్లు కొన్న సమంత.. ఎన్ని కోట్లో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-02-08 11:18:44.0  )
Samantha : ముంబైలో ఇల్లు కొన్న సమంత.. ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవల మయైసైటీస్ వ్యాధి బారిన సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో, సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం నటించిన యశోద సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విషయాన్ని సాధించింది. కాగా, ఇప్పుడు సమంత పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న శాకుంతలంలో నటించింది. ప్రస్తుతం సామ్ సీటాడెల్, ఖుషీ సినిమా షూటింగ్‌లో ఉంది. తాజాగా, సమంత ముంబైలో ఓ ఇల్లు కొన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఇల్లు 15 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అది కూడా ధనవంతులు ఉండే ఏరియాలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకుందట. అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం పెట్టిన ఫొటో కూడా అందులో దిగిందేనని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story