సమంతకు- విజయ్ దేవరకొండతో అందుకే లిప్ కిస్‌లు పెట్టించాను .. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2023-09-02 07:31:57.0  )
సమంతకు- విజయ్ దేవరకొండతో అందుకే లిప్ కిస్‌లు పెట్టించాను .. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో లిప్ లాక్స్, బెడ్ రూమ్ సీన్స్ కచ్చితంగా ఉంటాయి. అర్జున్ రెడ్డి దగ్గర నుంచి చూస్తే.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఇలా ప్రతి సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ లో అయితే విజయ్ దేవరకొండ రెచ్చిపోయి బెడ్ రూమ్ సన్నివేశం చేశాడు. ఇక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్న ఖుషి చిత్రంలో కూడా ఈ తరహా సన్నివేశాలు ఉన్నాయి. సమంత-విజయ్ దేవరకొండ లిప్ లాక్స్ సీన్స్ లో నటించారు. అలాగే బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియాలో కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఆ తరహా సన్నివేశాలు లేకుండా విజయ్ దేవరకొండ సినిమాలు చేయడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా, దీనిపై ఖుషి సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. ‘‘కథలో భాగంగానే ఆ సీన్స్ పెట్టాము. అప్పుడు సమంత కనిపించలేదు ఆరాధ్య అనుకుని చేశాము. పాత్రకు ఆ సమయంలో లిప్ లాక్ సీన్ అవసరం. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే ఎమోషన్స్ గురించి చెప్పేటప్పుడు ఆ చిన్న ముచ్చట లేకపోతే ఎలా?. ఆ తరహా సన్నివేశాలు లేకపోతే వారు భార్య భర్త అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగదు. అందుకే శృంగార సన్నివేశాలు పెట్టాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివ నిర్వాణ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More : ఖుషి’ మూవీ సక్సెస్ కల నిజమయ్యిందంటూ.. సమంత ఎమోషనల్ పోస్ట్

Advertisement

Next Story