పుష్ప 2’లో సమంత.. సాంగ్ మాత్రమే కాదు సీన్స్‌లోనూ కనిపించనుందా?

by Mahesh |   ( Updated:2023-11-10 17:25:03.0  )
పుష్ప 2’లో సమంత.. సాంగ్ మాత్రమే కాదు సీన్స్‌లోనూ కనిపించనుందా?
X

దిశ, సినిమా : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న సమంత.. ‘పుష్ప 2’లో ‘ఊ అంటావా’ సాంగ్‌తో ఫుల్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. దీంతో ఈ భామ సినిమాల కోసం సౌత్‌తోపాటు నార్త్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’ భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా సామ్ ఈ చిత్రంలో కేవలం పాటలో మాత్రమే కాదు కొన్ని సీన్స్‌లో కూడా కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడంతో.. త్వరలో జాయిన్ కాబోతుందని సమాచారం.

అయితే అనారోగ్యం దృష్ట్యా ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్.. నిజంగానే ‘పుష్ప 2’ చేయబోతుందా అనే అంశంపై అభిమానులు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇదే నిజమైతే ఈ ఏడాది వరుస ఫెయిల్యూర్స్ చూసిన బ్యూటీకి ఈ మూవీ బూస్ట్ ఇచ్చినట్లే అవుతుందని అంటున్నారు నెటిజన్లు.

Read More...

Samantha Ruth Prabhu

Advertisement

Next Story