మలయాళం ఇండస్ట్రీని పొగిడేసిన సామ్.. మొత్తానికి ఆ కోరికను బయటపెట్టింది..!!

by S Gopi |   ( Updated:2023-04-01 14:24:44.0  )
మలయాళం ఇండస్ట్రీని పొగిడేసిన సామ్.. మొత్తానికి ఆ కోరికను బయటపెట్టింది..!!
X

దిశ, సినిమా: కేరళ కొచ్చిలో ‘శాకుంతలం’ 3డీ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో దేవ్, హీరోయిన్ సమంత, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలిమ గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సామ్.. మలయాళం ఇండస్ట్రీని పొగిడేసింది. మాలీవుడ్ సినిమాలను చూసి చాలా నేర్చుకుంటున్నానని, ఇక్కడ ప్రతీ నటుడు కూడా ఇన్‌స్పిరేషన్ అని తెలిపింది. ‘సూపర్ డీలక్స్’లో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ చూసి మైండ్ బ్లాక్ అయిందన్న సామ్.. మలయాళం స్ట్రెయిట్ ఫిల్మ్ అతనితోనే చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఇక ఈ క్రమంలో ‘శాకుంతలం’ హీరో దేవ్‌ను కూడా పొగిడేసిన సామ్.. తప్పకుండా థియేటర్స్‌లోనే సినిమా చూడాలని కోరింది.

Also Read..

కారులోనే అన్ని పనులు కానిచ్చేస్తున్న సమంత.. వైరల్ పిక్

Advertisement

Next Story