Samajavaragamana OTT Release Dates ‘సామజవరగమన’ ఓటీటీ రిలీజ్ డేట్

by Prasanna |   ( Updated:2023-07-11 06:49:27.0  )
Samajavaragamana OTT Release Dates ‘సామజవరగమన’ ఓటీటీ రిలీజ్ డేట్
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఏడాది సమ్మర్‌ సీజన్‌ని కాపాడింది చిన్న చిత్రాలే. తాజాగా రిలీజ్ అయిన ‘సామజవరగమన’ మూవీ కూడా ప్రేక్షకులకు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చింది. కేవలం రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌ని జరుపుకున్న ఈ చిత్రం, పది రోజులకు గాను రూ. 11 కోట్లకు‌పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక రీసెంట్‌గా ఓటీటీ ఆడియన్స్‌ కోసం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ నెల 22 లేదా 25న ఓటీటీ‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత క్లారిటీ త్వరలో రానుంది.

Read More: Samantha and Vijay Deverakonda : సమంత చేసిన పనికి ఇబ్బంది పడుతున్న విజయ్

Advertisement

Next Story