మూడో భర్తపై అక్రమ సంబంధం ఆరోపణలు.. బ్రిట్నీకి ఊహించని షాక్ ఇచ్చిన సామ్

by Anjali |   ( Updated:2023-08-17 14:10:49.0  )
మూడో భర్తపై అక్రమ సంబంధం ఆరోపణలు.. బ్రిట్నీకి ఊహించని షాక్ ఇచ్చిన సామ్
X

దిశ, సినిమా: అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు తన మూడో భర్త సామ్ అస్గారి ఊహించని షాక్ ఇచ్చాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవ నడుస్తుండగా బ్రిట్నీకి ఆయన విడాకులు ఇచ్చేస్తున్నట్లు తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు త్వరలోనే ఆమె తనను టార్చర్ చేసిన పూర్తి సమాచారం వెల్లడిస్తానని చెప్పాడని, తన మీద మోసం ఆరోపణలు చేసినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడని తెలుస్తోంది. ‘కొన్ని వారాల క్రితం నేను మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని గొడవ చేసింది. నేను మోసం చేయలేదని ఎంత చెప్పినా పట్టించుకోలేదు. నేను ఒంటరిగా పార్టీకి వెళితే జీర్ణించుకోలేదు. అనవసరమైన ఆరోపణలు చేస్తుంది. తరచు నాపై అరుస్తూ ఓ పోరాటం చేస్తుంది. బ్రిట్నీ శారీరకంగానూ గాయ పరుచుకునేందుకు వెనకాడదు. ఎందుకంటే ఆమె ప్రవర్తన స్థిరంగా ఉండదు. అందుకే తన భర్తగా ఉండలేను. బ్రిట్నీని భరించలేను’ అని సామ్ చెప్పినట్లు సన్నిహితులు వెల్లడించారని నెట్టింట ప్రచారం నడుస్తోంది.

Advertisement

Next Story