ఈ తరం నటులకు డబ్బు పిచ్చి ఎక్కువ.. ఆ ధ్యాసే ఉండట్లేదు

by samatah |
ఈ తరం నటులకు డబ్బు పిచ్చి ఎక్కువ.. ఆ ధ్యాసే ఉండట్లేదు
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త తరం హీరోలు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ పెంచడంపై సల్మాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన రీసెంట్ సమావేశంలో పలు అసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఈ జనరేషన్ నటులు ముఖ్యంగా హీరోలుగా నటించేవారు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్లందరికీ సినిమా అంటే చాలా తపన ఉంది. ఫ్యూచర్ ప్లాన్ కూడా పక్కాగానే ఉంటుంది. రెండు సినిమాలు హిట్ కాగానే రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. కానీ తనతోపాటు సీనియర్ యాక్టర్స్ షారుఖ్, అమీర్, అక్షయ్, అజయ్‌ అలా లేరు. రెమ్యూనరేషన్ కన్నా సినిమాకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే మూవీ సక్సెస్ అయితే ఇండస్ట్రీ ఆటోమేటిక్‌గా మనను ముందుకు తీసుకెళ్తుంది’ అని అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed