పైసా సంపాదన లేని వ్యక్తికి చెల్లినిచ్చి పెళ్లి చేసిన సల్మాన్.. పైగా అంతా మీరే చూసుకోవాలంటూ కండీషన్!

by sudharani |
పైసా సంపాదన లేని వ్యక్తికి చెల్లినిచ్చి పెళ్లి చేసిన సల్మాన్.. పైగా అంతా మీరే చూసుకోవాలంటూ కండీషన్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఈద్‌కు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లోని బడా కోటీశ్వరుల్లో ఒకడని అందరికి తెలిసిన విషయమే. కానీ, ఆ డబ్బు గర్వం ఎప్పుడూ చూపించుకోడని, చాలా సింపుల్‌గా ఉంటాడు ఇప్పటికే సల్మాన్ సన్నిహితులు, స్నేహితులు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆస్తిని ఏ మాత్రం లెక్క చెయ్యని సల్మాన్ తన చెల్లి ఇష్టపడిందని పైసా కూడా సంపాదించని ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా తన చెల్లి భర్తనే చెప్పుకొచ్చాడు. అతడు మరెవరో కాదు కాంగ్రెస్ కీలక నేత పండిత్ సుఖ్ రామ్ మనవడు ఆయుశ్ శర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయుష్ తన ప్రేమ, పెళ్లి గురించి పలు ఆశక్తికర కామెంట్స్ చేశాడు.

ఆయన మాట్లాడుతూ.. ‘అర్పిత ఖాన్ (సల్మాన్ ఖాన్ చెల్లి), నేను 2014లో ప్రేమ వివాహం చేసుకున్నాము. ఆ సమయంలో మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పినప్పుడు.. నువ్వు ఏ పని చెయ్యడం లేదు ఏం పెట్టి ఆ పిల్లని పోషిస్తావు. పైగా వాళ్లు పెద్ద కుటుంబానికి చెందిన వాళ్లు. మరి ఆమెను ఎలా పోషిస్తావు అని మా అమ్మ, నాన్న అడిగారు. నేనేం పోషించను అంతే మీరే చూసుకోవాలని నేను వాళ్లతో చెప్పాను. అప్పుడు నాపై వాళ్లు చాలా సీరియస్ అయ్యారు. తర్వాత ఏదో రకంగా మా వాళ్లను ఒప్పించి సల్మాన్ ఇంటికి తీసుకెళ్లాను. అక్కడ మా నాన్న మాట్లాడుతూ.. ‘మేమంతా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ఉంటాము. నువ్వు అక్కడికి రాగలవా’ అని అర్పితను అడిగారు. దానికి సల్మాన్.. ఆయుశ్ ఎక్కడ ఉంటే అర్పిత అక్కడే ఉంటుంది. మీరేం కంగారు పడకండి అని చెప్పారు. ఇలా అందరూ కలిసి మా ప్రేమను కలిపారు. ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఆయుశ్, అర్పితకు అయత్ (కూతురు), అఖిల్ శర్మ (కొడుకు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Next Story