Salaar టికెట్స్ ధర ఎంతో తెలుసా..? రెబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!

by Nagaya |   ( Updated:2023-12-21 14:51:40.0  )
Salaar టికెట్స్ ధర ఎంతో తెలుసా..? రెబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సలార్’ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో హోంబలే ఫిలింగ్ నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రేపు రిలీజ్ కాబోతున్న సలార్ మూవీకి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేయగా.. యాప్స్ కూడా క్రాష్ అయిన సంగతి తెలిసిందే.

ఇక సలార్ మూవీకి ఒక్కరోజులోనే 30 లక్షల 25 వేల టికెట్స్ బుక్కై రికార్డ్ సృష్టించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లోనే ఈ చిత్రం రూ.20 కోట్ల మార్క్‌ను దాటింది. నిన్న రాత్రి 11:59 గంటల వరకు ఆంధ్రలో 13.25 లక్షలు, నైజాం 6 లక్షలు, నార్త్ ఇండియా 5.25 లక్షలు, కర్ణాటక 3.25 లక్షలు, కేరళలో లక్షన్నర, తమిళనాడులో లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి. వీటికి నేషనల్ చైన్ మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్లు అదనం. ఇవ్వేకాక ఈ రోజు రాత్రి అడిషనల్ స్క్రీన్స్ కూడా ఓపెన్ చేస్తామని బయ్యార్లు అధికారికంగా ప్రకటించారు.

కాగా, సలార్ వేవ్‌ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. టికెట్స్ బుక్ కాకుండా ఆన్‌లైన్ యాప్స్, వెబ్ సైట్స్ క్రాష్ కావడంతో ముందుగా టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లు బ్లాక్‌లో అమ్మకాలు చేపడుతున్నారు. ఒక్కో టికెట్‌ రూ.3 వేల నుంచి 5 వేల వరకు ధర పలకడం విశేషం. ఈ ధర రేపు ఉదయం వరకు రూ.7 నుంచి 10 వేల వరకు చేరే అవకాశం ఉందని ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటది మరి అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Read More..

వరుస ఫ్లాపులు వచ్చినా తగ్గని రేంజ్.. ‘సలార్’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ తెలిస్తే గుండె ఆగాల్సిందే?

Advertisement

Next Story