పవన్ కల్యాణ్ ‘OG’ కోసం ఎదురుచూస్తున్నా.. ఒక్కసారిగా హైప్ పెంచిన ‘సలార్’ నటి

by GSrikanth |
పవన్ కల్యాణ్ ‘OG’ కోసం ఎదురుచూస్తున్నా.. ఒక్కసారిగా హైప్ పెంచిన ‘సలార్’ నటి
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇందులో తమిళ నటి ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓజీ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్‌, టీజర్‌కు వేరే లెవల్ రెస్పాన్స్ వచ్చింది.

డైరెక్టర్ సుజిత్ స్వయంగా పవన్ కల్యాణ్ అభిమాని కావడంతో ఫ్యాన్స్‌ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. సలార్ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి ఓజీ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచారు. సలార్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొని ఓజీ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఓజీ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పవన్ కల్యాణ్ అభిమానులందరికీ ఆ సినిమా ధమ్ బిర్యానీ కాబోతోంది. సినిమాలో ఆయన ధరించిన డ్రెస్సులు, స్వాగ్‌, అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోబోతోంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story