ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన సలార్ మూవీ

by Jakkula Samataha |
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన సలార్ మూవీ
X

దిశ, సినిమా : ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఓటీటీలో నేడు స్ట్రీమింగ్ కానుంది.ఈ మూవీ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

అలాంటి భారీ బడ్జెట్ మూవీ రిలీజై నెల రోజులకూడా పూర్తి కాకముందే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే సలార్ మూవీని తీవ్ర పోటీ నడుమ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందంట.ఈ నేపథ్యంలోనే మూవీని శుక్రవారం (జనవరి 20) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో సలార్‌ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులో వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రభాస్‌ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Advertisement

Next Story