బావా రెండు నిమిషాలు.. దొరసానిలా రెడీ చేస్తా.. ‘సలార్‌’ను మలుపు తిప్పిన నటి ఈమే..! (వీడియో)

by Nagaya |   ( Updated:2024-05-31 15:56:37.0  )
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే చాలా రోజుల తరువాత ప్రభాస్ భారీ హిట్టు కొట్టాడు. దీంతో పదేళ్ల ఆకలి సలార్‌తో తీరిందని సంబురపడి పోతున్నారు ఫాన్స్. అయితే సలార్ సినిమాలో సెకండ్ ఆఫ్‌లో వచ్చే ఒక ఫైట్ సినిమాకే హైలెట్. ఆ ఫైట్‌లో విలన్‌తో ‘రెండు నిమిషాలు బావ.. దొరసానిలా రెడీ చేస్తా’ అని అంటుంది ఒక క్యారెక్టర్. దానికి కౌంటర్‌గా ప్రభాస్.. ‘రెండు నిమిషాలు దొరగా రెడీ చేస్తా’ అనే ఆ డైలాగ్‌కి థియేటర్‌లో విజిల్స్ క్లాప్స్ పడుతున్నాయి. ఆ క్యారెక్టర్ చేసిన పూజ విశ్వేశ్వరన్.. హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సలార్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను దిశ టీవీతో పంచుకుంది. ఆమె పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.

Advertisement

Next Story