ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సాక్షి.. యాక్షన్ హీరోగా రాబోతున్నాడంటూ

by samatah |   ( Updated:2023-07-26 15:18:08.0  )
ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సాక్షి.. యాక్షన్ హీరోగా రాబోతున్నాడంటూ
X

దిశ, సినిమా: ఇండియన్ మాజీ క్రికెటర్ MS ధోని ఇకపై నటుడిగా మారబోతున్నాడనే విషయంపై ఆయన భార్య సాక్షి సింగ్ ఓపెన్ అయింది. ఈ మేరకు ఇటీవల ధోని స్థాపించిన ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థనుంచి హరీష్ కల్యాణ్, ఇవానా జంటగా నదియా, యోగిబాబు ముఖ్య పాత్రల్లో LGM ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ తమిళ్ సినిమా రాబోతుంది. దీనికి రమేష్ తమిళమని దర్శకత్వం వహించగా ధోని భార్య సాక్షి సింగ్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంది. అయితే ఈ మూవీ జూలై 28న రిలీజ్ కానుండగా తెలుగులో కూడా LGM ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రెస్ మీట్‌లో.. ధోని కూడా సినిమాల్లో నటిస్తాడా? అంటూ సాక్షిని ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీంతో ‘ఒకవేళ ధోని హీరోగా సినిమా చేస్తే అది కేవలం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అలాంటి మంచి మెసేజ్ ఉన్న కథ దొరికితే ఆయన తప్పకుండా నటిస్తారు’ అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read More: ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఊర్వశి.. ఫ్లయింగ్ కిస్‌లకు కుర్రాళ్లు ఫిదా

Advertisement

Next Story