- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబద్దాలు చెప్పడం, పొగడడం నా వల్ల కాదు.. స్టార్ హీరో
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణాలను వెల్లడించాడు. బీ టౌన్ సెలబ్రిటీలతో పాటు సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ ఎల్లప్పుడూ నెట్టింట యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అయితే అందుకు భిన్నంగా ఉంటున్న సైఫ్ ఇంటర్‌నెట్‌లో సమయం కేటాయించడం అస్సలు నచ్చదని చెప్పాడు. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ సరైన ఐడీ లభించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు నెట్టింట ఎంటర్ అయితే తనకు ఆందోళన ఉంటుందన్న ఆయన.. అనేక అబద్దాలు చెప్పాల్సి ఉంటుందని, అలా చెప్పడం, ఇతరులను పొగడటం ఇష్టపడనన్నాడు. ఇక తాను అంతర్జాలంలో యాక్టివ్‌గా లేకపోయినా సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నాడు. ఇదిలావుంటే.. ఇటీవల ఆయన నటించిన 'విక్రమ్ వేద' విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. ప్రస్తుతం 'ఆదిపురుష్' లో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు.
ఇవి కూడా చదవండి : హద్దులు లేకుండా నటించడమే నాకు ఇష్టం.. యంగ్ బ్యూటీ