Saidharam Tej : స్టేజ్‌పైనే అభిమానులకు క్షమాపణ చెప్పిన మెగా హీరో

by Prasanna |   ( Updated:2023-04-17 13:16:08.0  )
Saidharam Tej : స్టేజ్‌పైనే అభిమానులకు క్షమాపణ చెప్పిన మెగా హీరో
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరక్కెకించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలకానున్న సందర్భంగా ప్రమోషన్ జోరుగా కొనసాగిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఏలూరులో జరిగిన ప్రి రీలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే ఈ వేదికపై సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడిన సాయి ధరమ్ తేజ్.. తన బైక్ యాక్సిడెంట్ గురించి తలచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

‘మీ అభిమానం, ప్రేమను పొందడం నా లక్ష్యం. దాని కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను. నా జీవితంలో బైక్ యాక్సిడెంట్ ఊహించలేదు. మీ అందరినీ టెన్షన్‌ పెట్టినందుకు క్షమించండి. కానీ ఆ క్షణం అమ్మ, తమ్ముడి‌తో మాట్లాడటానికి చాలా ట్రై చేసినప్పటికి నాకు మాటలు రాలేదు. నాకు జరిగిన ఈ ప్రమాదం మరెవరికి జరగకూడదు’ అని చెప్పిన హీరో.. స్టేజ్ మీద హెల్మెట్ చూపిస్తూ అందరూ ధరించాలని కోరాడు. .

Also Read..

స్టార్ హీరో శింబుకు ఆ అనారోగ్య సమస్య ఉండటం వల్లే పెళ్లి చేసుకోలేదా?

Advertisement

Next Story