Sai Pallavi: నా మొటిమలు, వాయిస్.. అభద్రతా భావానికి గురిచేశాయి

by Prasanna |   ( Updated:2023-03-31 08:26:45.0  )
Sai Pallavi: నా మొటిమలు, వాయిస్.. అభద్రతా భావానికి గురిచేశాయి
X

దిశ, సినిమా: యుక్తవయసులో తన వాయిస్, మొటిమలు, అందంపై చాలా సందేహాలుండేవంటోంది సాయి పల్లవి. అలాగే తనను తాను కొన్నిసార్లు అసురక్షిత వ్యక్తిగా భావించుకుంటూ అభద్రతా భావానికి లోనయ్యానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘ఒకప్పుడు నేను చాలా అభద్రతాభావంతో ఉండేదాన్ని. ప్రతి విషయంలోనూ చాలా సందేహాలు ఉండేవి. కానీ, 2015లో వచ్చిన ‘ప్రేమమ్’ తర్వాత ప్రేక్షకులు, చిత్ర దర్శకుల ప్రశంసలు నా ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. ఈ విషయంలో క్రెడిట్ అంతా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్‌కు దక్కుతుంది. నేను చాలా సినిమాల్లో మేకప్ వేసుకోలేదు. నాతో కలిసి పనిచేసిన దర్శకులు ఎప్పుడూ వేసుకోమని ఇబ్బంది పెట్టలేదు. నిజానికి ప్రజలు చర్మాన్ని చూసి కాదు.. అంతకు మించిన విషయాలను ప్రేమిస్తారని గ్రహించాను. ఇదే నాకు వ్యక్తిగతంగా చాలా సహాయపడింది’ అని వివరించింది.

ఇవి కూడా చదవండి: ఇండస్ట్రీలో నైతిక విలువలు లేవు.. కాజల్ షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story