- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
18 ఏళ్లు ఉన్నప్పుడే 23 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. సాయిపల్లవి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి నెటిజన్లను ఫిదా చేసింది. పరిశ్రమలో ఈ బ్యూటీ నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తర్వాత ‘పడి పడి లేచే మనసు, విరాట పర్వం, ఎంసీఏ, మారి-2, కాళీ, లవ్ స్టోరీ, ప్రేమమ్’ సినిమాల్లో నటించి.. తన అందం, అభినయం, డాన్స్, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల సాయిపల్లవికి సినీ అవకాశాలు తగ్గాయి.
అయితే ఈ నేచురల్ బ్యూటీ చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి విషయం వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాయి పల్లవి వివాహం చేసుకోకుండానే పూజా కన్నన్ పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? ఇంత త్వరగా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటూ జనాలు నెట్టింట ఆరా తీస్తునే ఉన్నారు. ప్రస్తుతం పూజా కన్నన్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే సాయిపల్లవి గతంలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పుకొచ్చింది. ‘‘ నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే 23 సంవత్సరాలకే వివాహం చేసుకోవాలనుకున్నాను. 30 ఏళ్లలోపే పిల్లల్ని కనాలని భావించాను. నేను అప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇంట్లో కొన్ని బాధ్యతల కారణంగా పెళ్లిని పోస్ట్ పోన్ చేశాను. ఇక సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవడం వల్ల వివాహానికి టైమ్ తీసుకోవాలనుకుంటున్నాను’’. అంటూ సాయిపల్లవి వెల్లడించింది.