ఓటీటీలోకి వచ్చేస్తున్నశబరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Prasanna |
ఓటీటీలోకి  వచ్చేస్తున్నశబరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా: వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తాజా చిత్రం శబరి. ఈ సినిమాకి అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో లోగణేష్ వెంకట్రామన్, శశాంక్ కీలక పాత్రల్లో నటించారు. టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో పాటు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగడంతో శబరి సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేకపోయింది.

ఇదే సమయంలో చాలా సినిమాలు ఉండటం శబరి సినిమాకు మైనస్ అయింది. కానీ, శబరి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటనకు ప్రశంసలు దక్కాయి. కథలో కొన్ని మలుపులు బాగున్నాయనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. థియేటర్లో మార్కులు వేపించుకోలేకపోయిన ఓటీటీలో మంచి మార్కులు పడతాయని మూవీ టీం భావిస్తున్నారు.

ఓ మాదిరిగా ఆడిన శబరి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో రిలీజ్ అవుతోంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. జూన్ 14న శబరి OTTలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలో శబరి OTT విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story