ఆర్ఆర్ఆ‌ర్‌కు ఆస్కార్ దక్షిణాదికి గర్వకారణం: సౌత్ సేన

by Satheesh |   ( Updated:2023-03-13 15:02:51.0  )
ఆర్ఆర్ఆ‌ర్‌కు ఆస్కార్ దక్షిణాదికి గర్వకారణం: సౌత్ సేన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రావడంపై సౌత్ సేన సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. దక్షిణ భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన 'నాటు నాటు' గీతం దక్షిణ భారతీయ సినిమాను మరో స్థాయికి చేర్చిందని పేర్కొన్నారు.

ఇంతటి ఘనత పొందేలా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్టీఆర్, రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యలకు అభినందనలు అని సౌత్ సేన ప్రతినిధులు రవి, శ్రీనివాస్, శ్రీకాంత్, రమేష్ బాబు, విలియం కేర్, జగదీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి :

'ఆర్‌ఆర్‌ఆర్‌ 2' పై క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చిన రైటర్‌ విజయేంద్రప్రసాద్‌..

Advertisement

Next Story