RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా మరో రికార్డు సాధించింది.. అదేంటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-18 05:43:17.0  )
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా మరో రికార్డు సాధించింది.. అదేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డుల హోరు ఇప్పటిలో ఆగేలా లేదుగా. ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త రికార్డు సాధించింది. ఈ విషయం తెలిసిన అభిమానులు సంబరాలు జరుపకుంటున్నారు. ఒక సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా గురించి నెల లేదంటే రెండు నెలలు దాని గురించే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఈ సినిమా విడుదలై ఏడాది అయింది.. ఇప్పటికి ప్రతి ఒక్కరి నోటిలో ఈ పేరు నానుతుంది. మొన్న ఆస్కార్ అందుకొని చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రెండవ హయ్యెస్ట్ గ్రాసర్‌గా రూ. 1236 కోట్లతో ఈ సినిమా నిలిచింది.

Read more:

శివ సినిమా క్లైమాక్స్ అక్కడే.. స్వప్న లోక్ ప్రమాదంపై ఆర్జీవీ ట్వీట్ (వీడియో)

Advertisement

Next Story